తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రానాతో విశ్వక్​సేన్, తరుణ్ భాస్కర్ సందడి - విశ్వక్​సేన్ రానా

'ఈ నగరానికి ఏమైంది?' చిత్రంతో అలరించారు విశ్వక్​సేన్, తరుణ్ భాస్కర్. తాజాగా వీరిద్దరూ రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'నెంబర్.1 యారి' కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు.

No.1 Yaari show
నెం 1 యారి

By

Published : Apr 22, 2021, 8:47 PM IST

'ఈ నగరానికి ఏమైంది?' చిత్రంతో హిట్‌ కాంబినేషన్‌ అనిపించుకున్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్‌, నటుడు విశ్వక్‌ సేన్‌. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'నెంబర్.1 యారి' కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు. ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

విశ్వక్‌ సేన్‌ తొలి ముద్దు ఏ వయసులో? ఇంట్లో ఒంటరిగా ఉంటే విశ్వక్‌ ఏం చేస్తాడు? అని రానా ప్రశ్నించగా విశ్వక్‌ చెప్పిన సమాధానాలు నవ్వులు పంచుతున్నాయి. వీటి మధ్యలో తరుణ్‌ భాస్కర్‌ చేసిన అల్లరి అలరిస్తోంది. టాంజానియా దేశ రాజధాని ఏంటి అని అడగ్గా.. ఇంత తేలిక ప్రశ్నా! నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అని తరుణ్‌, విశ్వక్‌ చేసిన సందడి మెప్పిస్తుంది. ఏప్రిల్‌ 25న పూర్తి కార్యక్రమం ఆహా (ఓటీటీ)లో ప్రసారం కానుంది. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి..

ABOUT THE AUTHOR

...view details