తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆకట్టుకుంటోన్న 'థ్యాంక్​ యు బ్రదర్' ట్రైలర్ - థ్యాంక్​ యు బ్రదర్ ట్రైలర్

అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం టథ్యాంక్​ యు బ్రదర్'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది.

Thank U Brother trailer released by Venkatesh
ఆకట్టుకుంటోన్న థ్యాంక్​ యూ బ్రదర్ ట్రైలర్

By

Published : Jan 29, 2021, 6:42 AM IST

అనసూయ భరద్వాజ్‌, అశ్విన్‌ విరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'థ్యాంక్‌ యు బ్రదర్‌'. రమేష్‌ రాపర్తి దర్శకుడు. మాగుంట శరత్‌చంద్రా రెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. గురువారం హీరో వెంకటేష్‌ ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు.

అనంతరం వెంకీ మాట్లాడుతూ "టైటిల్‌తో పాటు ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. చాలా సస్పెన్స్‌ ఉంది. ఓటీటీలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని అందరూ చూడాలి" అన్నారు. "లిఫ్ట్‌లో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయినప్పుడు జరిగే కథని ఎలా తీస్తారనేది అప్పుడు నాకు అర్థం కాలేదు. సినిమా ఎవరినీ నిరాశపరచదు" అన్నారు అనసూయ. విరాజ్‌ మాట్లాడుతూ.. "మంచి కథా బలమున్న చిత్రమిది" అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గుణ సుబ్రమణియన్‌, కెమెరా: సురేష్‌ రగుతు.

ABOUT THE AUTHOR

...view details