తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'థ్యాంక్ యు బ్రదర్​' మేకింగ్ వీడియో చూశారా? - 'థ్యాంక్ యు బ్రదర్​' మేకింగ్ వీడియో

అనసూయ, విరాజ్ అశ్విన్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'థ్యాంక్​ యు బ్రదర్' (Thank You Brother). మే 7న ఆహా వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. తాజాగా ఈ మూవీ మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

anasuya
అనసూయ

By

Published : May 27, 2021, 7:44 AM IST

అనసూయ, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన‌ చిత్రం 'థ్యాంక్ యు బ్రదర్‌' (Thank You Brother). రమేష్‌ రాపర్తి దర్శకత్వం వ‌హించారు. మే 7న 'ఆహా' (Aha) వేదికగా విడుద‌లై అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల్ని అల‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో సినిమా మేకింగ్ విడుద‌లైంది.

లిఫ్ట్‌లో అన‌సూయ‌ (Anasuya), విరాజ్‌ల మ‌ధ్య జ‌రిగే కీల‌క స‌న్నివేశాన్ని ఎలా తెర‌కెక్కించారో ఇందులో చూడొచ్చు. ఈ చిత్రంలో అన‌సూయ గ‌ర్భ‌వ‌తి పాత్ర పోషించింది. ఈ పాత్రకోసం చిత్రబృందం ఎంత క‌ష్ట‌ప‌డిందో ఈ వీడియో తెలియ‌జేస్తుంది.

ఈ చిత్రాన్ని జస్ట్ ఆర్డినరి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మాగుంట శరత్‌చంద్రారెడ్డి, తారక్‌ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మౌనికా రెడ్డి, ఆదర్శ్‌ బాలకృష్ణ, అన్నపూర్ణ, వైవా హర్ష, కాదంబరి కిరణ్‌ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు. గుణ బాలసుబ్రమణ్యం సంగీతం అందించారు.

ABOUT THE AUTHOR

...view details