ఈ ఏడాది 'అల..వైకుంఠపురంలో' పాటలతో ప్రేక్షకులకు ఆకట్టుకున్న తమన్.. ఇప్పుడు మరోసారి తన మ్యాజిక్ చూపించనున్నాడు. 'సామజవరగమన..' అంటూ సంగీత అభిమానులను అలరించిన తమన్-సిద్ శ్రీరామ్ కాంబినేషన్లో మళ్లీ మరో పాట రూపొందుతొంది. 'పింక్' తెలుగు రీమేక్‌లో సిద్ శ్రీరామ్ ఓ గీతాన్ని ఆలపిస్తున్నట్టు ట్విట్టర్లో తెలిపాడు తమన్. ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందిస్తున్నాడు.
'పింక్' తెలుగు రీమేక్‌తో పవన్‌కల్యాణ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో పవన్.. న్యాయవాది పాత్రలో నటిస్తాడని సమాచారం. వీటితో పాటు క్రిష్, హరీశ్ శంకర్ సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మే 15న చిత్రం విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.