తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​ కెరీర్​లో​ బెస్ట్ మూవీ 'భీమ్లా నాయక్': తమన్ - Trivikram thaman movies

Pawan kalyan bheemla nayak: పవన్​ 'భీమ్లా నాయక్' సినిమా ఔట్​పుట్​ గురించి క్రేజీ విషయాన్ని చెప్పారు తమన్. పవర్​స్టార్ కెరీర్​లోనే ఇది ది బెస్ట్ మూవీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

pawan kalyan bheemla nayak movie
పవన్ భీమ్లా నాయక్ మూవీ

By

Published : Jan 23, 2022, 1:35 PM IST

Trivikram thaman movies: పవర్​స్టార్ పవన్ కల్యాణ్​ 'భీమ్లా నాయక్' గురించి అదిరిపోయే విషయం చెప్పారు ఆ సినిమా సంగీత దర్శకుడు తమన్. సినిమా అద్భుతంగా వచ్చిందని అన్నారు. త్రివిక్రమ్, తాను సినిమాలోని కొన్ని సీన్స్​ ఇప్పటికే చూశామని చెబుతూ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

"త్రివిక్రమ్, నేను.. 'భీమ్లా నాయక్' మూవీ రషెస్ చూశాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది పవన్​ కల్యాణ్ కెరీర్​లోనే ది బెస్ట్ మూవీ. నావైపు నుంచి వీలైనంత మంచి మ్యూజిక్ ఇస్తానని హామీ ఇస్తున్నాను" అని తమన్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

త్రివిక్రమ్-తమన్-పవన్​ కల్యాణ్

మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్ కోశియమ్'​కు తెలుగు రీమేక్ 'భీమ్లా నాయక్'. ఇందులో పవన్ పోలీస్ అధికారిగా నటించారు. రానా మరో ప్రధాన పాత్ర పోషించారు. నిత్యా మేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. త్రివిక్రమ్.. స్క్రీన్​ప్లే-మాటలు అందించగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. నాగవంశీ నిర్మించారు.

సంక్రాంతి రావాల్సిన 'భీమ్లా నాయక్' పలు కారణాలతో ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఆ రోజు కూడా థియేటర్లలోకి సినిమా వచ్చేది అనుమానమేనని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details