మహేశ్ బాబు(mahesh babu movies) హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. కీర్తి సురేశ్ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే తమన్-మహేశ్ కాంబోలో వచ్చిన 'దూకుడు', 'ఆగడు', 'బిజినెస్‌మ్యాన్' మ్యూజిక్ ఆల్బమ్స్ అభిమానుల్ని ఊర్రూతలూగించాయి. ఇప్పుడు వస్తోన్న 'సర్కారువారి పాట' సంగీతం(sarkaru vaari paata songs) కూడా అదే స్థాయిలో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. దానికి తగ్గట్లే తమన్(thaman latest songs) తాజాగా చేసిన ఓ ట్వీట్ ఈ సినిమా పాటలపై అంచనాల్ని అమాంతం పెంచేసింది.
'సర్కారు వారి పాట' సాంగ్ అప్డేట్ ఇచ్చిన తమన్! - తమన్ సర్కారు వారి పాట ట్యూన్
మహేశ్ బాబు(mahesh babu movies) హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'సర్కారు వారి పాట'(sarkaru vaari paata songs). ఈ చిత్రంలోని ఓ సాంగ్‌కు సంబంధించిన ఆసక్తికర ట్వీట్ చేశారు సంగీత దర్శకుడు తమన్.
ఈ సినిమాలోని తొలి పాట(sarkaru vaari paata songs)ను దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది చిత్రబృందం. ఈ క్రమంలో తమన్ చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో కీబోర్డ్ కనిపిస్తూ దాని వెనకాల ఓ ఎనర్జిటిక్ ట్రాక్ వినిపిస్తోంది. 'ఈ ట్రాక్ మీ స్పీకర్లను బద్దలుకొడుతుంది' అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చారు తమన్. దీంతో ఈ సినిమాలోని ఈ ట్యూన్(sarkaru vaari paata songs) విన్న ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. హిట్ సాంగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13(sarkaru vaari paata release date)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని మహేశ్ లుక్ అభిమానుల్ని విశేషంగా అలరించింది.