వరుస ఆల్బమ్స్ హిట్లతో దూసుకుపోతున్న తమన్.. అదిరిపోయే అవకాశం సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కబోయే 'లూసిఫర్' రీమేక్‌కు సంగీతమందించనున్నారు. ప్రతి సంగీత దర్శకుడికి చిరుతో పనిచేయాలనేది కల అని, ఇప్పుడు తనకు ఆ అవకాశం దక్కిందని ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. బాస్‌పై ఉన్న ఇష్టాన్ని మ్యూజిక్ రూపంలో చూపిస్తానని అన్నారు.
ఇందులో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించనున్నారు. మోహన్‌రాజా దర్శకుడు. ఈ సినిమాను గురువారం(జనవరి 21) లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.