రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్ కుమార్ ప్రారంభించిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'కు విశేష స్పందన లభిస్తోంది. ఇటీవలే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు చేసిన ఛాలెంజ్‌కు స్పందిస్తూ.. చెన్నైలోని తన నివాసంలో ఓ మొక్క నాటాడు తమిళ స్టార్ హీరో విజయ్. ఆగస్టు 9న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఓ మొక్క నాటి.. మరో ముగ్గురు ప్రముఖులను ఎంపిక చేసి.. వారిని ఈ ఛాలెంజ్‌ను కొనసాగించమని కోరాడు ప్రిన్స్. అందులో తమిళ అగ్రనటుడు విజయ్ కూడా ఉన్నాడు.
మహేశ్ సవాలు స్వీకరించిన దళపతి విజయ్ - విజయ్, మహేశ్ బాబు గ్రీన్ఇండియా ఛాలెంజ్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు విసిరిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'ను స్వీకరించాడు తమిళ నటుడు విజయ్. ఇందులో భాగంగా ఓ మొక్కను నాటాడు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని తెలిపాడు విజయ్.
'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ఓ అద్భుతమైన కార్యక్రమమని.. ఇందులో దేశంలోని ప్రముఖులంతా భాగస్వాములవుతున్నారని తెలిపాడు హీరో విజయ్. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో ఒక్కో మనిషికి కావాల్సిన మొక్కలు చాలా తక్కువగా ఉన్నాయని.. వాటి ద్వారా వచ్చే ఆక్సిజన్ సరిపోవడం లేదని వెల్లడించాడు. అందువల్లే దేశంలో ఆక్సిజన్ అమ్మే కేంద్రాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మనకు తెలిసిన వాళ్లు, అభిమానించే వారు మొక్కలు నాటే విధంగా కోరడం.. ఒకరి ద్వారా మరొకరు గ్రీన్ ఛాలెంజ్‌ను కొనసాగించడం వల్ల ప్రజల్లో అవగాహన మరింత పెరుగుతుందని అన్నాడు. ఇలాంటి కార్యక్రమంలో తాను భాగం కావడం ఎంతో ఆనందాన్నిచ్చిందని చెప్పాడు.