'తలైవి'లో తనను తీసుకోవడానికి ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాదే కారణమని చెప్పింది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ఆయన లేకపోతే గొప్ప అవకాశం కోల్పోయేదాన్నని తెలిపింది.
సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో 'తలైవి' రూపుదిద్దుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది.
'తలైవి' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సందర్భంగా తమిళ్ తెలియని, తమిళ రాజకీయాలంటే ఊసే లేని తాను జయలలిత సినిమా చేయడం ఎంతో గర్వంగా ఉందని కంగనా తెలిపింది. జయలలిత పాత్రలో కంగనా అందరగొట్టిందని రచయిత విజయేంద్రప్రసాద్ అన్నారు. తలైవి ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తలైవిలో విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్ర పోషించారు. విబ్రీ మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్ టైమ్ మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఇదీ చూడండి:sunitha: 'మామయ్య.. గతంలోకి నడవాలనుంది'