తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఐకాన్​ ఆఫ్​ గోల్డెన్​ జూబ్లీ'గా రజనీకాంత్​ - IFFI, honour, Rajinikanth, Lifetime Achievement Award, Javadekar

ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ ఆఫ్​ ఇండియా(ఐఎఫ్​ఎఫ్​ఐ) ప్రతి ఏటా నిర్వహించే పురస్కారాల్లో తమిళ తలైవా రజనీకాంత్​కు అరుదైన గౌరవం దక్కింది. 'ఐకాన్​ ఆఫ్​ గోల్డెన్​ జూబ్లీ' అవార్డుకు ఇతడిని ఎంపిక చేసింది భారత ప్రభుత్వం.

'ఐకాన్​ ఆఫ్​ గోల్డెన్​ జూబ్లీ'గా రజనీకాంత్​

By

Published : Nov 2, 2019, 12:19 PM IST

Updated : Nov 2, 2019, 7:39 PM IST

50వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో(ఐఎఫ్​ఎఫ్ఐ​) భాగంగా రజనీకాంత్​కు​ అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు 'ఐకాన్​ ఆఫ్​ గోల్డెన్​ జూబ్లీ' అవార్డును ఇవ్వనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన చేశారు.

గోవాలో వేడుకలు..

గోవా వేదికగా నవంబర్​ 20 నుంచి 28 వరకు ఐఎఫ్​ఎఫ్​ఐ వేడుకలు జరగనున్నాయి. ఈ ఏడాది భారత్​, రష్యా సంయుక్తంగా ఈ ఉత్సవాలు నిర్వహించనున్నాయి.

గోవా వేదికగా ఐఎఫ్​ఎఫ్​ఐ వేడుకలకు ఆహ్వానం

ఇందులో వివిధ దేశాల చిత్ర పరిశ్రమల నుంచి ఎంపిక చేసిన 200 చిత్రాలు ప్రదర్శించనున్నారు. ఇందులో 24 సినిమాలు ఆస్కార్​ రేసులో ఉన్నాయి. ప్రీమియర్​ మూవీగా 'ఎక్ట్రావగంజా' ఎంపికైంది. వీటితో పాటు దాదా సాహెబ్​ పాల్కే అవార్డు విజేత అమితాబ్​ బచ్చన్​ నటించిన దాదాపు ఎనిమిది చిత్రాలు... 'మూవీ గాలా' వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తెలుగు నుంచి ఎఫ్​-2 సినిమాను ప్రదర్శించనున్నారు.

ఐఎఫ్​ఎఫ్​ఐ వేడుకల్లో ప్రదర్శనకు ఎంపికైన 'ఎఫ్​2'

ఫ్రెంచ్​ నటీమణి ఇసాబెల్లే హప్పర్ట్​ను జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశారు. ఇది స్వర్ణోత్సవం కావడం వల్ల మహిళా నిర్మాతలు తీసిన 50 సినిమాలు ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. సినీ రంగంలో మహిళా సాధికారతను గుర్తించేందుకు భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జావడేకర్​ వెల్లడించారు.

Last Updated : Nov 2, 2019, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details