తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Dhoni Vijay: తలా ధోనీ దళపతి విజయ్​తో.. ఫ్యాన్స్​కు పండగే - ధోనీ విజయ్

చెన్నై సూపర్​ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. తమిళ హీరో విజయ్​ను (Dhoni Vijay) కలిశాడు. ప్రాక్టీస్​లో భాగంగా మహి చెన్నైలో ఉండగా.. బీస్ట్​ షూటింగ్​లో (Beast Vijay) భాగంగా గోకులం స్టూడియోస్​లో విజయ్​ నటిస్తున్నారు.

vijay dhoni
విజయ్ ధోనీ

By

Published : Aug 12, 2021, 3:45 PM IST

టీమ్ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్​ కింగ్స్​ 'తలా' ఎంఎస్.ధోనీ.. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్​ను (Dhoni Vijay) కలిశాడు. యాడ్ షూటింగ్ కోసం మహి అక్కడికెళ్లగా.. గోకులం స్టూడియోస్​లో విజయ్​ చిత్రం 'బీస్ట్' షూటింగ్ (Beast Vijay) జరుగుతోంది.

విజయ్ తన కారవన్​లో ధోనీతో మాట్లాడిన అనంతరం మర్యాద పూర్వకంగా సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ ఫ్యాన్​ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు సెలబ్రిటీలు ఒకేచోట కలవడం వల్ల అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

సరాదాగా మాట్లాడుకుంటున్న తలా, దళపతి
ధోనీతో విజయ్

సెప్టెంబర్​ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్​ రెండో దశ ప్రాక్టీస్ కోసం ధోనీ ఇప్పటికే చెన్నై చేరుకున్నాడు. ఐపీఎల్​ 14వ సీజన్​ వాయిదా పడే సమయానికి సీఎస్కే జట్టు 7 మ్యాచ్​లాడింది. వాటిలో ఐదింట్లో గెలిచిన ధోనీ సేన 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

ఇదీ చదవండి:MS Dhoni: చెపాక్‌ చేరిన సీఎస్కే సింహం.. ప్రాక్టీస్​ కోసమే

ABOUT THE AUTHOR

...view details