తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'తడమ్'​ రీమేక్​.. సిద్ధార్థ్​ స్థానంలో ఆ హీరో! - తడమ్​ రీమేక్ సిద్ధార్థ్​ ఔట్

కథ, స్క్రీన్​ప్లేలో భారీ మార్పులు చేయడం వల్ల తమిళ సినిమా 'తడమ్'​ హిందీ రీమేక్​ నుంచి హీరో సిద్ధార్థ్​ మల్హోత్రా తప్పుకొన్నారని తెలిసింది. దీంతో మరో హీరో ఆదిత్యరాయ్​ కపూర్​తో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారని సమాచారం.

Thadam remake
తడమ్​ రీమేక్​

By

Published : Apr 23, 2021, 3:01 PM IST

తమిళ థ్రిల్లర్​ సినిమా 'తడమ్'​ హిందీ రీమేక్​ నుంచి హీరో సిద్ధార్థ్​ మల్హోత్రా తప్పుకొన్నట్లు సమాచారం. కథ, స్క్రీన్​ప్లేలో భారీగా మార్పులు చేయడం వల్ల ఈ సినిమా నుంచి దూరమయ్యాడట.

2020 మార్చిలో సిద్ధార్థ్​, మృనాల్​ థాకూర్​ ప్రధాన పాత్రల్లో 'తడమ్'​ హిందీ రీమ్​క్​ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి వర్ధన్​ కేట్కర్​ దర్శకుడు. అదే ఏడాది మేలో సినిమాను పట్టాలెక్కించాలని భావించినా కరోనా వల్ల తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆ తర్వాత ప్రస్తుతం మళ్లీ తీయాలనే ఆలోచనతో కథ, స్క్రీన్​ప్లేలో భారీ మార్పులు చేసి సిద్ధార్థ్​ను సంప్రదించారట. అయితే ఈ మార్పులు నచ్చకపోవడం వల్ల సిద్ధార్థ్​ ఈ చిత్రంలో నటించడానికి విముఖత చూపించాడని వినికిడి.

దీంతో ఈ రీమ్​క్​లో మరో హీరో ఆదిత్యరాయ్​ రాయ్​ కపూర్​ను చిత్రబృందం తీసుకున్నట్లు తెలిసింది. మృనాల్​ యథావిధిగా తన పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆదిత్య 'ఓం: ది బ్యాటిల్​ వితిన్'​ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తవ్వగానే 'తడమ్'​ సెట్​లో అడుగుపెడతాడు. ఈ సినిమా తెలుగు రీమేక్​ను యువ హీరో రామ్​తో తెరకెక్కించగా విడుదలై విజయాన్ని అందుకుంది.

ఇవీ చదవండి:రాధే రిలీజ్​.. తగ్గేదే లే అంటున్న సల్మాన్

ABOUT THE AUTHOR

...view details