తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కేన్స్ చిత్రోత్సవాల్లో తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్

తెలంగాణ చిత్రపరిశ్రమలో పెట్టుబడులు ఆకర్షించడానికి.. యానిమేషన్, వీడియో గేమింగ్ విభాగాలు విస్తరించడానికి తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పుస్కూరు రామ్మోహనరావు కేన్స్ చిత్రోత్సవాల్లో విదేశీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

పుస్కూరు రామ్మోహనరావు

By

Published : May 20, 2019, 9:23 AM IST

తెలంగాణ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు ఆకర్షించడానికి తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పుస్కూరు రామ్మోహనరావు ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ చిత్రోత్సవాల్లో విదేశీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

కేన్స్ చిత్రోత్సవాలకు తెలంగాణ చిత్ర పరిశ్రమ తరఫున హాజరైన ఆయన అక్కడికి విచ్చేసిన దేశ, విదేశీ ప్రతినిధులతో తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, సాంకేతికతతో పాటు తెలంగాణలో స్టూడియోలు నిర్మించడానికి, యానిమేషన్, వీడియో గేమింగ్ విభాగాలను విస్తరించడానికి చర్చలు జరిపారు.

హిందుజా గ్రూప్ బ్రదర్స్‌తో తెలంగాణలో ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో స్టూడియోల నిర్మాణంతో పాటు ఇతర విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని రామ్‌మోహన్‌రావు ఆహ్వానించారు. కేన్స్ చిత్స్రోతవాల్లో డీజీక్విస్ట్ ఛైర్మన్ బసిరెడ్డి, ఐటిపీవో ప్రెసిడెంట్ అసిఫ్ ఇక్భాల్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి.. మరోసారి మంచి మనసు చాటుకున్న లారెన్స్

ABOUT THE AUTHOR

...view details