'ఇన్‌సోమ్నియా', 'ఇన్సెప్షన్', 'ఇంటర్‌స్టెలర్ల్' వంటి అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ మూవీలను తెరకెక్కించిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'టెనెట్'. డాన్ డేవిడ్ వాష్టింగ్టన్, రాబర్ట్ పాటిసన్, ఎలిజెబెత్ డెబిస్కీ, డింపుల్ కపాడియా కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ వేదికగా విడుదల కానుందని వార్తలు వచ్చాయి. తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చారు నిర్మాణ సంస్థ వార్నర్ మీడియా సీఈఓ జాన్ స్టాంకే. సినిమా కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
'టెనెట్' సినిమా విడుదల థియేటర్లోనే..? - టెనెట్ సినిమా
ప్రముఖ హాలీవుడ్ చిత్రం 'టెనెట్' ఓటీటీ వేదికగా విడుదల కాదని స్పష్టం చేశారు వార్నర్ మీడియా సీఈఓ జాన్ స్టాంకే. జులై 17న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా... కరోనా కారణంగా తాత్కాలిక వాయిదా పడింది.
'టెనెట్' సినిమా విడుదల థియేటర్లోనే..?
ఈ ఏడాది జులై 17న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం... కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. టైమ్ ట్రావెల్‌లో సాగే సినిమా అంటూ గతంలో కొన్ని వార్తలు రాగా.. వాటికి ట్రైలర్‌తో తెరపడింది. మరి ఈసారి క్రిస్టోఫర్ నోలాన్ ఏ కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.