బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు తెలుగు కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. అతడితో హిందీలో 'ఛత్రపతి' సినిమాని రీమేక్ చేయబోతున్నారు. ప్రభాస్ కెరీర్‌కి ఊపునిచ్చిన చిత్రం 'ఛత్రపతి'. భావోద్వేగాలు, యాక్షన్ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. ఆ సినిమా హక్కుల్ని సొంతం చేసుకున్న ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ, అక్కడి దర్శకుడితోనే సినిమాని రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం.
ప్రభాస్ సినిమాతో బాలీవుడ్‌లోకి బెల్లంకొండ! - బాలీవుడ్ బెల్లంకొండ సాయిశ్రీనివాస్
'అల్లుడు శీను'గా తెలుగు తెరకు పరిచయమై ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు యువనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అతడు త్వరలోనే ప్రభాస్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. 'ఛత్రపతి' హిందీ రీమేక్‌లో శ్రీనివాస్ హీరోగా నటించనున్నాడు.
ప్రభాస్ మూవీతో బాలీవుడ్‌లోకి బెల్లంకొండ!
ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటించనున్నాడు. యాక్షన్ కథల్లో బెల్లంకొండ చక్కగా ఒదిగిపోతుంటాడు. అతడి తెలుగు సినిమాలు హిందీలో డబ్ అవుతూ, అంతర్జాలంలో మంచి ఆదరణ పొందుతుంటాయి. 'ఛత్రపతి' రీమేక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికొచ్చే అవకాశాలున్నాయి.
Last Updated : Nov 12, 2020, 9:31 AM IST