లాక్‌డౌన్ సమయం కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఇష్టమైన పనులు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రతిరోజూ షూటింగ్లతో బిజీగా గడిపే సినీ తారలు ప్రస్తుతం ఇంటికే పరిమితమవడం వల్ల తాము చేయాలనున్న పనులన్నీ చేసేస్తున్నారు.
బామ్మ దగ్గర వెన్న తీయడం నేర్చుకున్న చెర్రీ - వెన్న తీయడం నేర్చుకున్న చెర్రీ
లాక్డౌన్తో ఇంటికే పరిమితమైన రామ్చరణ్... వెన్న తీయడం ఎలానో తన బామ్మదగ్గర నుంచి నేర్చుకుంటున్నాడు. ఈ వీడియోను తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
ప్రముఖ టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ వెన్న తీయడం ఎలానో తన బామ్మ దగ్గర నేర్చుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
ఈ వీడియోలో వాళ్ల అమ్మ సురేఖ, బామ్మ ఇద్దరూ వెన్న చిలుకుతుంటే చెర్రీ వాళ్లని అడిగి తెలుసుకున్నాడు. అతను కూడా వెన్న చిలికాడు. ఇలా చేస్తుండగా బామ్మ 'కృష్ణుడిలా ఉన్నావ్' అని చెర్రీని అనడం వల్ల చిరు నవ్వు చిందిస్తూ అందరిని దృష్టిని ఆకర్షించాడు రామ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవలే 'బీ ద రియల్‌మేన్' ఛాలెంజ్‌తోనూ రియల్‌మేన్ అనిపించుకున్నాడు చెర్రీ. ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్'తో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.