punith rajkumar family: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు తెలుగు హీరో అల్లు శిరీష్. బెంగళూరు సదాశివనగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లి శిరీష్ సంతాపం తెలిపారు.
రాజ్‌కుమార్ భార్య అశ్విని, ఆయన కుటుంబ సభ్యులతో సుమారు గంటసేపు మాట్లాడారు. పునీత్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అల్లు అర్జున్ మాదిరిగానే తనకు పునీత్‌తో మంచి సంబంధం ఉందని తెలిపారు. బెంగళూరు వచ్చినప్పుడు పునీత్‌ను కలిసేవాడినని గుర్తు చేసుకున్నారు.