టాలీవుడ్ సీనియర్ హాస్య నటుడు అలీ త్వరలో హాలీవుడ్ చిత్రంలో ప్రధానపాత్రలో కనిపించనున్నాడు. దానేటి జగదీశ్ దర్శకత్వంలో మార్టిన్ ఫిలిమ్స్ అధినేత జానీ మార్టిన్, పింక్ జాగ్వార్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థల సహకారంతో ఓ చిత్రం తెరకెక్కనుందట. ఇది ఇండో-అమెరికన్ నేపథ్యంలో తీయనున్నట్లు అలీ వెల్లడించాడు.
హాలీవుడ్లో ఛాన్స్ కొట్టేసిన అలీ - ali in hollywood
ప్రముఖ హాస్యనటుడు అలీ హాలీవుడ్లో ఛాన్స్ కొట్టేశాడట. శుక్రవారం దిల్లీ వెళ్లిన ఈ సీనియర్ నటుడు.. అక్కడ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ను కలిశాడు. అనంతరం భారత్లో ఓ ఇంగ్లీష్ దర్శకుడు సినిమా నిర్మించనున్నాడని.. అందుకు పలు ప్రాంతాల్లో చిత్రీకరణ అనుమతి కావాలని కోరినట్లు అలీ స్వయంగా వెల్లడించాడు.
![హాలీవుడ్లో ఛాన్స్ కొట్టేసిన అలీ Telugu Senior Comedian Ali Basha acting in hollywood..?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5830510-114-5830510-1579885148326.jpg)
హాలీవుడ్లో ఛాన్స్ కొట్టేసిన కమేడియన్ అలీ
హాలీవుడ్లో ఛాన్స్ కొట్టేసిన కమేడియన్ అలీ
శుక్రవారం దిల్లీలోని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ను మర్యాదపూర్వకంగా కలిశాడు. అనంతరం చిత్ర షూటింగ్కు సంబంధించిన లోకేషన్లపై చర్చించినట్లు చెప్పాడు. చిత్రీకరణ అనుమతులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని అలీ చెప్పాడు.
Last Updated : Feb 18, 2020, 7:59 AM IST