తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కన్నడ సినిమాకు తెలుగులో ఫ్యాన్సీ రేటు! - రష్మిక మందన వార్తలు

కన్నడ హీరో ధృవ్​ సర్జా, హీరోయిన్​ రష్మిక జోడీగా నటించిన చిత్రం 'పొగరు'. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన 'కరాబు' పాటకు కన్నడ, తెలుగు ప్రేక్షకుల నుంచి విశేషాదరణ లభిస్తోంది. దీంతో ఈ సినిమాపై తెలుగులోనూ అమాంతంగా క్రేజ్​ పెరగడం వల్ల ఫ్యాన్సీ రేటుకు తెలుగు హక్కులు అమ్ముడుపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

Telugu rights of Dhruva Sarja and Rashmika Mandanna's Pogaru sold for this much
కన్నడ సినిమాకు తెలుగులో ఫ్యాన్సీ రేటు!

By

Published : Dec 3, 2020, 4:29 PM IST

స్టార్​ హీరోయిన్​ రష్మిక, ధృవ్​ సర్జా జోడీగా నటించిన కన్నడ చిత్రం 'పొగరు'. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు హక్కులు భారీ రేటుకు అమ్ముడపోయినట్లు సమాచారం. వైజాగ్​కు చెందిన ఫైనాన్షియర్​, నిర్మాత డి. ప్రతాప్​ రాజు.. రూ.3.30 కోట్లకు 'పొగరు' సినిమా హక్కులను సొంతం చేసుకున్నారట. తెలుగులో సాయిసూర్య ఎంటర్​టైన్మెంట్స్​ బ్యానర్​పై ఈ సినిమాను విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన 'కరాబు' పాటకు సోషల్​మీడియాలో విశేషాదరణ లభిస్తోంది. ఈ పాటతో పాటు హీరో ధృవ్​ వేసిన స్టెప్పులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడం వల్లే నిర్మాతలు దీనికోసం పోటీ పడినట్లు తెలుస్తోంది. చివరికి వైజాగ్​కు చెందిన నిర్మాత ప్రతాప్​ రాజు సొంతం చేసకున్నారని సమాచారం.

'పొగరు' సినిమాను కన్నడతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. కన్నడలో ఈ సినిమా టైటిల్​ 'పొగరు' అని ప్రకటించగా.. తెలుగులో ఏ పేరుతో విడుదల చేస్తారనే విషయంపై స్పష్టత లేదు. ఈ చిత్రానికి నందన్​ కిషోర్​ దర్శకత్వం వహించారు.

ABOUT THE AUTHOR

...view details