తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినీ పరిశ్రమపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సి.కల్యాణ్

తెలుగు సినీ పరిశ్రమ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో ఒక విభాగానికి సంబంధించి రాయితీలు ప్రకటించడం సరైంది కాదన్నారు.

By

Published : Dec 20, 2020, 5:04 PM IST

సినీ పరిశ్రమపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సి.కల్యాణ్
సినీ పరిశ్రమపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సి.కల్యాణ్

సినీ పరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై సి.కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మాతల విజ్ఞప్తులను కూడా ముఖ్యమంత్రి జగన్ పరిశీలనలోకి తీసుకోవాలని కోరారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో థియేటర్ల విద్యుత్ బిల్లులు రద్దు చేయడం విషయంలో నిర్మాతలకు ప్రయోజనమేమీ లేదన్నారు.

తెలంగాణ ప్రభుత్వం తరహాలో చిన్న సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించాలని సి.కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

సినీ పరిశ్రమపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సి.కల్యాణ్

ఇదీ చదవండి:పులిగుండాల ప్రాజెక్టులో ముగ్గురు యువకుల గల్లంతు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details