తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Producer died: టాలీవుడ్ నిర్మాత మృతి - సినిమా లేటెస్ట్ న్యూస్

తెలుగులో పలు లఘ చిత్రాలతో పాటు 'హార్మోన్స్' సినిమా తీసిన నిర్మాత నాయక్ తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖలు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.

telugu producer ss nayak died
నిర్మాత నాయక్

By

Published : Oct 29, 2021, 6:50 AM IST

తెలుగు సినీ నిర్మాత ఎన్‌.ఎస్‌.నాయక్‌ (55) మృతి చెందారు. 'హార్మోన్స్‌' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇటీవల హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని 'హార్మోన్స్‌' చిత్ర దర్శకుడు ఆనంద్‌కుమార్‌ తెలియజేశారు.

నాయక్‌ సినిమాలతో పాటు 'ప్రజా హక్కు', 'అంటరానితనం', 'చిరు తేజ్‌' లాంటి లఘు చిత్రాలను నిర్మించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details