'స్క్విడ్‌గేమ్'(squid game web series story).. 2021 సెప్టెంబరు 17న అన్ని వెబ్ సిరీస్‌ల్లానే ఓటీటీలో సాధారణంగా విడుదలైంది. రిలీజైన 27 రోజుల్లోనే 111 మిలియన్ (11 కోట్లకిపైగా) వీక్షణలతో అసాధారణ విజయం అందుకుంది. ఈ కొరియన్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్(squid game netflix review) వేదికగా 90 దేశాల్లోని ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. చెప్పేందుకు చిన్న కథే అయినా కథనం కట్టిపడేసింది. అందుకే ఎక్కువ మంది చూసిన సిరీస్‌గా నం.1 స్థానంలో కొనసాగుతోంది.
భారతదేశంలోనూ(squid game record) ఈ సిరీస్‌కి విపరీతమైన క్రేజ్ లభించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని 'నెట్‌ఫ్లిక్స్' ఈ సిరీస్‌ను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో డబ్ చేసింది. యూట్యూబ్ వేదికగా తెలుగు ట్రైలర్‌ను అందించింది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి...