తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Sirivennela died: సిరివెన్నెల చనిపోవడానికి కారణాలు ఇవే - సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణానికి కారణాలు

Sirivennela sitaramasastry died: ప్రముఖసినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు(మంగళవారం) సాయంత్రం కన్నుమూశారు. ఆయన చవిపోవడానికి గల కారణాలను తెలిపారు కిమ్స్‌ ఎండీ డాక్టర్‌ భాస్కర్‌రావు. అవేంటంటే..

సిరివెన్నెల చనిపోవడానికి కారణాలు ఇవే,  Sirivennela death reasons
సిరివెన్నెల చనిపోవడానికి కారణాలు ఇవే

By

Published : Nov 30, 2021, 8:25 PM IST

Sirivennela died: ప్రముఖసినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం కన్నుమూశారు. ఆయనకు చికిత్స అందించిన కిమ్స్‌ ఎండీ డాక్టర్‌ భాస్కర్‌రావు .. సిరి వెన్నెల చనిపోవడానికి గల కారణాలను మీడియాకు వివరించారు.

"ఆరేళ్ల క్రితం క్యాన్సర్‌తో సగం ఊపిరితిత్తు తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బైపాస్‌ సర్జరీ కూడా జరిగింది. వారం క్రితం మరో వైపు ఊపిరితిత్తుకి క్యాన్సర్‌ వస్తే దాంట్లో కూడా సగం తీసేశారు. ఆ తర్వాత రెండ్రోజులు బాగానే ఉన్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అడ్వాన్స్‌డ్‌ ట్రీట్‌మెంట్‌ కోసం కిమ్స్‌కు తీసుకొచ్చారు. కిమ్స్‌లో రెండ్రోజులు వైద్యం అందిస్తే బాగానే రికవరీ అయ్యారు. ప్రికాస్టమీ కూడా చేశాం. 45 శాతం ఊపిరితిత్తు తీసేశాం కాబట్టీ.. మిగిలిన 55 శాతం లంగ్‌కు ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. ఆక్సినేషన్‌ సరిగా లేక ఎక్మో మిషన్‌పై పెట్టాం. గత ఐదు రోజుల నుంచి ఎక్మో మిషన్‌పైనే ఉన్నారు. ఎక్మో మిషన్‌పై ఉన్న తర్వాత క్యాన్సర్‌, పోస్ట్‌ బైపాస్‌ సర్జరీ, ఒబీస్‌ పేషెంట్‌ కావడం, కిడ్నీ డ్యామేజ్‌ అవడంతో ఇన్‌ఫెక్షన్‌ శరీరమంతా సోకింది. దీంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు" అని కిమ్స్‌ ఆసుపత్రి ఎండీ భాస్కరరావు మీడియాకు వెల్లడించారు.

ఇదీ చూడండి: Sirivennela died: ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల ఇకలేరు

ABOUT THE AUTHOR

...view details