టాలీవుడ్ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజుల నుంచి కరోనాతో బాధపడుతున్న ఆయన.. బుధవారం మరణించారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు.
తెలుగు సంగీత దర్శకుడు కరోనాతో మృతి - KS.chandrasekhar keeravani koti manisharma
సంగీత దర్శకులు కీరవాణి, కోటి, మణిశర్మల గురువు చంద్రశేఖర్.. కొవిడ్‌తో మరణించారు. ఆయనకు పలువురు సినీ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.
![తెలుగు సంగీత దర్శకుడు కరోనాతో మృతి telugu music director KS.chandrasekhar died with corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11734793-389-11734793-1620820835174.jpg)
సంగీత దర్శకుడు చంద్రశేఖర్
యమకింకరుడు, ఆణిముత్యం ,భోళాశంకరుడు, ఆత్మ బంధువులు, ఉదయం, అదిగో అల్లదిగో లాంటి విజయవంతమైన చిత్రాలకు చంద్రశేఖర్ సంగీతమందించారు. ఎం.ఎం.కీరవాణి, కోటి, మణిశర్మ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఈయన దగ్గరే శిష్యరికం చేశారు.