తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సంక్రాంతి కంటే ముందే పండగ.. డిసెంబరులో 'సినిమా'ల ధమాకా

సంక్రాంతి కంటే ముందు టాలీవుడ్​లో పండగ వాతావరణం! వచ్చే నెలలో 'అఖండ', 'పుష్ప' లాంటి భారీ సినిమాలతో పాటు 'గని', 'శ్యామ్ సింగరాయ్' లాంటి మీడియం బడ్జెట్​ చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మరి ఎవరు ఫస్ట్​క్లాస్​ మార్కులు తెచ్చుకుంటారో?

telugu movies release in december
మూవీ రిలీజ్

By

Published : Nov 17, 2021, 10:33 AM IST

Updated : Nov 17, 2021, 11:49 AM IST

సినిమా ప్రేక్షకులరా సిద్ధమవండి. సంక్రాంతి కంటే ముందే సినీ పండగ వస్తోంది. చిన్న, పెద్ద తెలుగు సినిమాలు.. థియేటర్లలో ఈ నెలలోనే దాదాపు ఆరడజనకు పైగా విడుదల కానున్నాయి. మరికొన్ని చిత్రాలు కూడా థియేటర్లలో రిలీజయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి చూద్దాం.

బాలకృష్ణ 'అఖండ'- డిసెంబరు 2

బాలయ్య-బోయపాటి.. ఈ కాంబినేషన్​ పేరు చాలు అభిమానులకు సినిమా అంచనాలు పెరగడానికి. 'సింహా', 'లెజెండ్' బ్లాక్​బస్టర్లుగా నిలవడం వల్ల ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్లే ట్రైలర్​, పాటలు రూపొందించారు! ఇటీవల విడుదలైన అవి అలరిస్తూ.. చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ప్రేక్షకులను ఆత్రుతగా ఎదురుచూసేలా చేస్తోంది.

అఖండ సినిమాలో బాలకృష్ణ

డిసెంబరు 2న వెండితెరపైకి రానున్న 'అఖండ'లో బాలయ్య అఘోరా పాత్ర పోషించడం విశేషం. డైలాగ్స్​ కూడా అదిరిపోయే రేంజ్​లో ప్లాన్​ చేశారు! ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు.

సాహసాల 'స్కైలాబ్'-డిసెంబరు 4

అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన స్కైలాబ్​ ఉపగ్రహం సాంకేతిక కారణాలతో భూమిపై పడిపోనుందనే నేపథ్యంగా తీసిన సినిమా 'స్కైలాబ్'. నిత్యామేనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. తెలంగాణలోని బండ లింగపల్లి అనే పల్లెటూరిలో 1979 టైమ్​ పీరియాడ్​లో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమా తీశారు. ఆద్యంతం హాస్యభరితంగా ఉంటూనే ఆసక్తిని కలిగిస్తోంది. డిసెంబరు 4న థియేటర్లలోకి రానున్న.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగానే ఎదురుచూస్తున్నారు.

స్కైలాబ్ మూవీ

గుడ్​లక్ సఖి- డిసెంబరు 10

ఎన్నోసార్లు వాయిదా పడుతూ పడుతూ వచ్చిన కీర్తి సురేశ్​ సినిమా 'గుడ్​లక్ సఖి'. ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ తేదీ ఖరారు చేసుకుంది. తొలుత నవంబరు 26న రిలీజ్ అన్నారు కానీ దానిని డిసెంబరు 10కి మార్చారు. దీంతో ఈసారైనా సరే వస్తుందా లేదా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

కీర్తి సురేశ్ గుడ్​లక్ సఖి

ఇందులో కీర్తి సురేశ్ గిరిజన యువతిగా కనిపించనుంది. జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలకపాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత నగేశ్​ కుకునూర్ దర్శకత్వం వహించడం విశేషం.

అల్లు అర్జున్ 'పుష్ప'- డిసెంబరు 17

ఈ ఏడాది తెరకెక్కిన భారీ బడ్జెట్​ పాన్ ఇండియా 'పుష్ప'. బన్నీ ఫ్యాన్సే కాకుండా చాలామంది సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, లుక్స్​ రోజురోజుకూ హైప్ పెంచుతున్నాయి.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్

అలానే బన్నీ లుక్స్​ కేక పుట్టిస్తున్నాయి. పూర్తి మాస్​గా అల్లు అర్జున్ కనిపించనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తీస్తున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్​ నుంచి డాన్​గా మారిన పాత్రలో బన్నీ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

రష్మిక హీరోయిన్​గా నటిస్తుండగా, సమంత స్పెషల్ సాంగ్ చేయనుంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు ప్రతినాయక పాత్రల్లో కనిపించనుండటం విశేషం. దేవి శ్రీ ప్రసాద్ పాటలైతే నెక్ట్స్​ లెవల్​! దర్శకుడు సుకుమార్.. తనదైన ట్రేడ్​మార్క్.. మరికొన్ని రోజుల్లో వెండితెరపై మెరవనుంది.

'పుష్ప'తో పాటే డిసెంబరు 17న 'స్పైడర్​మ్యాన్: నో వే హోమ్' సినిమా కూడా థియేటర్లలోకి రానుంది.

'గని' వర్సెస్ 'శ్యామ్​సింగరాయ్'- డిసెంబరు 24

నేచురల్ స్టార్ నాని- మెగాహీరో వరుణ్​తేజ్.. ఒకేరోజు ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. నాని 'శ్యామ్​సింగరాయ్'గా థియేటర్లలోకి రానున్నారు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తుండగా.. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్​ హీరోయిన్లు. కోల్​కతా బ్యాక్​డ్రాప్​తో తీస్తున్న ఈ సినిమాలో నాని రెట్రో లుక్​ సూపర్బ్​గా ఉంది! దీంతో సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

నాని శ్యామ్​సింగరాయ్ సినిమా

నాని గత చిత్రాలు 'వి', 'టక్ జగదీష్'.. ఓటీటీలోనే వచ్చాయి. దీంతో తమ అభిమాని హీరో కొత్త సినిమా వెండితెరపై చూసేందుకు నేచురల్ స్టార్ ఫ్యాన్స్​ చాలా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు మెగాప్రిన్స్ వరుణ్​తేజ్ బాక్సర్​గా నటించిన చిత్రం 'గని'. డిసెంబరు 2నే రిలీజ్​ కావాల్సిన ఈ సినిమా.. పలు కారణాలతో తేదీ మార్చుకుని డిసెంబరు 24న థియేటర్లలోకి వస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించారు. మరి బాక్సర్​గా వరుణ్​ ఏ మేరకు అలరిస్తారో చూడాలి.

గని సినిమాలో వరుణ్​తేజ్

'పుష్ప' కంటే ముందే వస్తే థియేటర్ల సమస్య ఎదురయ్యే అవకాశం ఉందనే కారణంతోనే 'గని' రిలీజ్​ డేట్ మారిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా ఈ డిసెంబరు మాత్రం సినీ ప్రియులకు పండగే పండగ. దీని తర్వాత ఇంకా భారీ స్థాయిలో థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే సంక్రాంతి కానుకగా మూడు భారీ బడ్జెట్​ సినిమాలు రానున్నాయి. అందులో 'ఆర్ఆర్ఆర్', 'భీమ్లా నాయక్', 'రాధేశ్యామ్' ఉన్నాయి.

భీమ్లా నాయక్​లో పవన్ కల్యాణ్

ఇవీ చదవండి:

Last Updated : Nov 17, 2021, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details