తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే - డీజే టిల్లు

This week release movies: 'భీమ్లానాయక్'​ హవా ఇంకా తగ్గనేలేదు.. అంతలోనే మరికొన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అవేంటంటే..

This week release movies:
This week release movies:

By

Published : Feb 28, 2022, 1:17 PM IST

Telugu Movies: గతవారం 'భీమ్లానాయక్‌'తో సందడిగా మారిన బాక్సాఫీస్‌ ఆ జోష్‌ను మార్చి మొదటి వారంలోనూ కొనసాగించనుంది. ఈ సారి యువ కథానాయకులు సందడి చేయబోతున్నారు. అలాగే ఓటీటీల్లోనూ ఆసక్తికర చిత్రాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ఆ చిత్రాలేంటో చూసేయండి.

Hey Sinamika Release Date: ఆ ఒక్క కారణం ప్రేమ..

'ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి సవాలక్ష కారణాలున్నాయి. కానీ, కలిసి జీవించటానికి ఉన్న ఒకే ఒక్క కారణం ప్రేమ'అని అంటున్నారు దుల్కర్‌ సల్మాన్‌(Dulquer salmaan). ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన 'హే సినామిక'(hey sinamika). ప్రముఖ నృత్య దర్శకురాలు బృందా దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 3న ప్రేక్షకుల ముందుకురానుంది. దుల్కర్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌(kajal), అదితిరావు హైదరీ నటించారు. జియో స్టూడియోస్‌ నిర్మించిన ఈ సినిమాకు గోవింద్‌ వసంత సంగీతం అందించారు.

హే సినామిక

Aadavallu Meeku Joharlu Release Date: 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అంటున్న శర్వా

శర్వానంద్‌(sharwanand), రష్మిక(Rashmika) జంటగా తిరుమల కిషోర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'(Aadavallu Meeku Johaarlu). సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఖుష్బూ, రాధిక శరత్‌ కుమార్‌, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. "మంచి కథతో తెరకెక్కుతోన్న కుటుంబ కథా చిత్రమిది. టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమాలో మహిళలకు ఎంతో ప్రాధాన్యముంది. శర్వా, రష్మికల జంటకు మంచి మార్కులు పడతాయి" అని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు.

ఆడవాళ్లు మీకు జోహార్లు

Sebastian pc 524 Release Date: రేచీకటి కానిస్టేబుల్‌ కథ

'రాజావారు రాణిగారు', 'ఎస్‌. ఆర్‌. కల్యాణ మండపం' సినిమాలతో మంచి విజయం అందుకున్న యువ కథానాయకుడు కిరణ్‌కు అబ్బవరం(kiran abbavaram). బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం 'సెబాస్టియన్‌ పీసీ 524'(sebastian pc 524). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 4న విడుదల చేయనున్నారు. రేచీకటితో బాధపడే కానిస్టేబుల్‌ కథ ఇది. రేచీకటి కానిస్టేబుల్‌ నైట్‌ డ్యూటీ ఎలా చేస్తాడు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు? అనే అంశాలతో ఆసక్తికరం సినిమాను తీర్చిదిద్దారు. కిరణ్‌ సరసన కోమలి ప్రసాద్‌, నువేక్ష నటించారు. జిబ్రాన్‌ సంగీత దర్శకుడు.

సెబాస్టియన్‌ పీసీ 524

ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలివే..!

Dj Tillu: డీజే టిల్లు

థియేటర్లలో ఇటీవల విడుదలై, యువతను అమితంగా ఆకట్టుకున్న చిత్రం 'డీజే టిల్లు'(dj tillu). సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో మార్చి 4వ తేదీ నుంచి సందడి చేయనుంది. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్‌ క్రైమ్‌ కామెడీ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించింది. శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందించారు.

డీజే టిల్లు

Saamanyudu: 'సామాన్యుడు' కూడా వచ్చేస్తున్నాడు!

విశాల్‌(Vishal) కథానాయకుడిగా శరవణన్‌ దర్శకత్వంలో తాజా చిత్రం 'సామాన్యుడు'(samanyudu). డింపుల్‌ హయాతీ కథానాయిక. జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 4వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్‌ కానున్నట్లు విశాల్‌ ప్రకటించారు.

సామాన్యుడు

నెట్‌ఫ్లిక్స్‌

* ఎగైన్స్‌ ద ఐస్‌(హాలీవుడ్‌) మార్చి 2

* ద వీకెండ్‌ ఎ వే (హాలీవుడ్‌) మార్చి 3

* పీసెస్‌ ఆఫ్‌ హర్‌ (ఒరిజినల్‌ సిరీస్‌)మార్చి 4

అమెజాన్‌ ప్రైమ్‌

* నో టైమ్‌ టు డై (హాలీవుడ్‌) మార్చి 4

సోనీ లివ్‌

* అన్‌ దేఖీ (హిందీ సిరీస్‌) మార్చి 4

ఎంక్స్‌ ప్లేయర్‌

*వాండర్‌లస్ట్‌ (హిందీ సిరీస్‌) మార్చి 4

డిస్నీ+హాట్‌ స్టార్‌

* రుద్ర: ద ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌ (హిందీ సిరీస్‌) మార్చి 4

* సుత్‌ లియాన్‌ (హిందీ సిరీస్‌) మార్చి 4

ఇదీ చదవండి:'భీమ్లా నాయక్' వసూళ్ల మేనియా.. మూడురోజుల్లో రూ.100 కోట్లు

ABOUT THE AUTHOR

...view details