తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్(corona update) దాదాపు అదుపులోకి వచ్చింది. థియేటర్(theatre hyderabad) సమస్యలు ఒకొక్కటిగా తొలగుతుండటం వల్ల.. విడుదలకు సిద్ధమైన చిత్రాలన్నీ బాక్సాఫీస్ ముందుకు వరుస కడుతున్నాయి. ప్రేక్షకులూ నెమ్మదిగా థియేటర్లకు అలవాటు పడుతుండటం వల్ల.. సినీ వ్యాపారం క్రమంగా జోరందుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల సమస్య(movie tickets online andhra pradesh) ఇప్పటికీ కొలిక్కి రాకున్నా.. డిసెంబరు కల్లా అన్ని సమస్యలు తొలగుతాయన్న ఆశాభావం సినీ వర్గాల్లో కనిపిస్తోంది. అందుకే ఇన్నాళ్లు విడుదల విషయంలో స్పష్టత ఇవ్వని అగ్రతారలు సైతం దీపావళి మొదలు సంక్రాంతి(sankranti 2022).. వేసవి సీజన్ల వరకు బెర్తులన్నీ ఖరారు చేసుకున్నారు. ఇప్పటికీ కొన్ని కీలకమైన చిత్రాలు విడుదల తేదీల్ని ప్రకటించలేదు. మరి వాటి అడుగులు ఎటు? ప్రేక్షకుల ముందుకొచ్చేదెప్పుడు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కరోనాతో వాయిదా పడిన వినోదాల్ని వడ్డీ సహా తిరిగి వడ్డించేందుకు సిద్ధమవుతున్నారు అగ్ర కథానాయకుడు వెంకటేశ్. ఇటీవలే 'నారప్ప'గా ఓటీటీ వేదికగా వినోదాలు పంచిచ్చిన ఆయన.. ఇప్పుడు మరో రెండు చిత్రాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వీటిలో 'దృశ్యం 2'(drishyam 2 telugu) చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన తొలి తెలుగు చిత్రమిది. గతంలో వెంకీ - మీనా జంటగా నటించిన క్రైమ్ డ్రామా సినిమా 'దృశ్యం'కు సీక్వెల్‌గా రూపొందింది. దీన్ని ఓటీటీ వేదికగా సినీప్రియుల ముందుకు తీసుకురానున్నట్లు ఆ మధ్య ప్రచారం వినిపించినా.. చిత్ర బృందం నుంచి ఏ ప్రకటన వెలువడలేదు. అయితే ఇప్పుడిది దీపావళి, క్రిస్మస్‌లలో దేన్ని లక్ష్యంగా చేసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. వెంకీ నటిస్తున్న మరో చిత్రం 'ఎఫ్ 3'(f3 movie release date) ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలోనే ఉంది. దీన్ని సంక్రాంతి లక్ష్యంగానే ముస్తాబు చేస్తున్నట్లు అప్పట్లో వెంకీ ప్రకటించారు. అయితే ఇప్పటికే 'రాధేశ్యామ్'(radhe shyam release date), 'భీమ్లా నాయక్'(bheemla nayak release date), 'సర్కారు వారి పాట' సినిమాలు పండగ బరిలో పోటీ పడుతున్న నేపథ్యంలో 'ఎఫ్ 3' ఆ రేసులో నిలుస్తుందా? లేదా? అన్నది అనుమానంగా మారింది.