తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కల్యాణ్​రామ్​ '118' చిత్రానికి సీక్వెల్ రానుందా.. ? - telugu latest movie updates

టాలీవుడ్ హీరో కల్యాణ్​ రామ్​ 118 చిత్ర సీక్వెల్​లో నటించనున్నాడని సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాను తెరకెక్కించిన గుహన్.. సీక్వెల్​కూ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.

కల్యాణ్‌ రామ్ సీక్వెల్‌లో కనిపించనున్నాడా?

By

Published : Nov 15, 2019, 4:50 PM IST

నందమూరి హీరోకల్యాణ్‌ రామ్‌ సీక్వెల్‌లో నటించబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అదే ఏ చిత్రమో తెలుసా? దర్శకుడు కే.వి. గుహన్‌ తెరకెక్కించిన ‘118’ చిత్రం. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్​ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ తీసే పనిలో ఉన్నాడట గుహన్.

దర్శకుడు.. ఇప్పటికే కల్యాణ్‌ రామ్‌తో చర్చలు జరిపాడని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నందమూరి వారబ్బాయి ‘ఎంతమంచి వాడవురా’ చిత్రంలో నటిస్తున్నాడు. 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సినిమా పూర్తయిన తర్వాత 118 సీక్వెల్ తెరకెక్కించే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details