అమ్మా..నాన్న లేరులే...అని ఏ చెల్లినీ తక్కువగా చూడద్దురోయ్... అమ్మ ప్రేమను... నాన్న బాధ్యతను పంచుకుని.. అష్టఐశ్వర్యాలు ఇవ్వగలిగే 'రక్తసంబంధం' ఎన్టీఆర్‌లుంటారు. చెల్లే ప్రాణంగా బతికే అన్నకు, ఆ ప్రాణమే లేకుండా చేశారని తెలిస్తే.. అలా చేసిన వారి గుండెలు చీల్చకుండా ఉంటాడా? అన్నంటే తోడుండే వాడే కాదురా... తేడా వస్తే ప్రాణాలు తోడేసే బాలకృష్ణ లాంటి 'ముద్దులమామయ్య'లూ ఉంటారు. ఒంటరిగా కాలేజీకి వెళ్తుంది కదా! ఒక్కతే మార్కెట్టుకొచ్చింది లే! వీధిలో టీజ్ చేస్తే ఏంటి? అని ఆలోచిస్తున్నావా? చిరు లాంటి 'హిట్లర్'లు, పవన్‌కల్యాణ్ లాంటి 'అన్నవరం' అన్నలు ముందో వెనుకో ఉంటారు చూసుకో... కాళ్లు చేతులు విరగకుండా భద్రం చేసుకో!
తెలుగు చెల్లెళ్లకు 'హీరో' అన్నయ్యలు - rakhi day latest news
సోదర సోదరీమణులకు ఎంతో ఇష్టమైన రాఖీ పండగ వచ్చేసింది. అయితే తెలుగు చెల్లెళ్లకు హీరో అన్నయ్యలు కొందరు ఉన్నారు. వారి గురించే ఈ కథనం.
ఆడపిల్ల...ఈడ పిల్ల కాదనీ.. అత్తగారింట్లో అన్నీ భరిస్తుందిలే అనీ...రాచిరంపాన పెడితే అడిగేదెవరనీ... విర్రవీగుతున్నారా... కాస్త తగ్గండి.. 'అర్జున్'లో మహేశ్ లాంటి తమ్ముళ్లుంటారు. అక్కలకు రక్షణై నిలుస్తారు. కట్నం తేలేదని.. మగపిల్లోణ్ని కనివ్వలేదని.. ఇంకో కట్నం తెచ్చుకోవచ్చనీ..దురాశలకు పోయి.. బంగారుతల్లి సంసారంలో నిప్పులు పోశారో! 'రాఖీ' ఎన్టీఆర్‌లుంటారు... మిమ్మల్నే పెట్రోల్లా మండిస్తారు. జాగ్రత్తరా... జాగ్రత్త! తెలుగు చెల్లెళ్లకు... అన్నయ్యలంతా హీరోలే. తెలుగు అన్నయ్యలకు... చెల్లెళ్లంటే ప్రాణాలే..!
ఇవీ చదవండి: