తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అన్నాత్తే' ఫస్ట్​లుక్ అదుర్స్.. 'ఖిలాడి' సాంగ్ వచ్చేసింది - రవితేజ ఖిలాడి తొలి సాంగ్

వినాయక చవితి పండగ పురస్కరించుకుని సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'ఖిలాడి', 'అన్నాత్తే', 'మహాన్'​, నితిన్​ కొత్త సినిమా కబుర్లు ఉన్నాయి.

Telugu movie latest updates
తెలుగు సినిమా అప్​డేట్స్​

By

Published : Sep 10, 2021, 11:57 AM IST

వినాయక చవితి(vinayaka chavithi) కానుకగా సూపర్​స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న కొత్త చిత్రం 'అన్నాత్తే' (rajinikanth annaatthe) నుంచి ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకుడు. దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుందీ సినిమా.

మాస్‌ మహారాజ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'ఖిలాడి'(raviteja khiladi). రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని తొలి సాంగ్​ను విడుదల చేశారు. 'ఇష్టం' అంటూ సాగే ఈ పాట అలరిస్తోంది. పెన్ స్టూడియోస్‌, ఏ-స్టూడియోస్ ఎల్ఎల్పీ కలిసి నిర్మిస్తున్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. డింపుల్‌ హయాతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్(mahaan vikram movie), ఆయన తనయుడు ధృవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'మహాన్'. తాజాగా నేడు ఈ సినిమా నుంచి ధృవ్​కు సంబంధించిన ఫస్ట్​లుక్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని సెవన్​ స్క్రీన్​ స్టూడియో నిర్మించింది. సంగీత దర్శకుడు అనిరుధ్​ స్వరాలు సమకూర్చారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మహాన్​లో ధృవ్​ ఫస్ట్​లుక్​

ప్రముఖ ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్​ దర్శకత్వంలో నితిన్ నటించనున్న కొత్త సినిమా షూటింగ్​ ప్రారంభమైంది. వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభించారు. ఈ సినిమాలో కథానాయికగా కృతిశెట్టి కనిపించనుంది.

ఇదీ చూడండి:seetimaarr interview: గోపీచంద్​ను ఇమిటేట్ చేసిన నటి

ABOUT THE AUTHOR

...view details