*సూపర్‌స్టార్ రజనీకాంత్ 'అన్నాత్తే'(rajinikanth annaatthe) అప్డేట్స్ వినాయక చవితి(vinayaka chavithi) కానుకగా రానున్నాయి. ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం ఉదయం 11 గంటలకు, మోషన్ పోస్టర్‌ను సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకుడు. దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుందీ చిత్రం.
*'సీటీమార్'(seetimaarr) చిత్రబృందం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో(green india challenge) పాల్గొంది. దర్శకుడు సంపత్ నంది.. సినిమాలో నటించిన వారితో కలిసి 30 మొక్కలు నాటారు. అభిమానుల ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరారు. కబడ్డీ నేపథ్య కథతో తెరకెక్కిన ఈ సినిమా.. సెప్టెంబరు 10న థియేటర్లలోకి రానుంది.