*నాగార్జున 'బంగార్రాజు' షూటింగ్ బుధవారం నుంచి హైదరాబాద్‌లో మొదలైంది. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం.. 'సోగ్గాడే చిన్ని నాయనా'కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. నాగ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, నాగచైతన్య, కృతిశెట్టి కీలకపాత్రలు పోషిస్తున్నారు. తొలి భాగం తీసిన కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
* బట్టతల వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి? అనే కథతో తీసిన చిత్రం 'నూటొక్క జిల్లాల అందగాడు'. శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో నటించడం సహా కథను అందించారు. ఈ ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. రుహానీ శర్మ హీరోయిన్. రుహానీ శర్మ హీరోయిన్. విద్యాసాగర్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. సెప్టెంబరు 3న థియేటర్లలోకి రానుంది.