*సమంత(samantha movies) మరో బహుబాషా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై శాంతరుబన్ జ్ఞానశేఖరన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. నవంబరు నుంచి షూటింగ్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో ఇతర నటీనటుల వివరాలతో పాటు సినిమా విశేషాలు వెల్లడించనున్నారు.
*'స్వామిరారా', 'కేశవ' సినిమాలతో అలరించిన కాంబినేషన్ హీరో నిఖిల్(nikhil movies)-డైరెక్టర్ సుధీర్‌వర్మ. ఇప్పుడు వీరిద్దరూ మూడోసారి కలిసి పనిచేయనున్నారు. దసరా సందర్భంగా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఎస్వీసీసీ పతాకంపై విజయ బాపినీడు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఇతర నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు.