*గోపీచంద్, తమన్నా నటించిన 'సీటీమార్' సినిమా ఓటీటీ రిలీజ్(seetimaarr ott) ఖరారైంది. ఈనెల 15న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదల కానుంది. కబడ్డీ నేపథ్య కథతో తీసిన ఈ ఎంటర్టైనర్కు సంపత్ నంది దర్శకత్వం వహించారు.
*'18 పేజీస్' సినిమాతో బిజీగా ఉన్న నిఖిల్(nikhil siddharth movies).. మరో చిత్రానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్లో శుక్రవారం ఈ మూవీ లాంఛనంగా మొదలైంది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య మేనన్(iswarya menon upcoming movies) హీరోయిన్గా నటిస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభించడం సహా ఇతర వివరాలు వెల్లడించనున్నారు.
*ఆనంద్ దేవరకొండ 'హైవే'(anand deverakonda new movie) చిత్ర షూటింగ్ పూర్తయింది. రోడ్ అడ్వెంచర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు '118' ఫేమ్ కేవీ గుహన్ దర్శకత్వం వహించారు. మలయాళ నటి మానస రాధాకృష్ణన్(manasa radhakrishnan telugu movie).. ఈ మూవీతోనే హీరోయిన్గా పరిచయమవుతుంది. త్వరలో విడుదల తేదీ వెల్లడించే అవకాశముంది.