సినీప్రియుల ఎదురు చూపులకు తెరదించుతూ సోమవారం ఉదయం 'ఆర్‌ఆర్‌ఆర్ గ్లింప్స్' (RRR Glimpse) విడుదలైంది. తారక్-రామ్‌చరణ్‌తోపాటు సినిమాలో కీలకపాత్రలు పోషించిన వారందర్నీ ఈ 45 సెకన్ల వీడియోలో అద్భుతంగా చూపించారు. 'ఆర్‌ఆర్‌ఆర్ గ్లింప్స్'పై నేచురల్‌స్టార్ నాని (nani), ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ట్విటర్ వేదికగా తమ ఇష్టాయిష్టాలను తెలిపారు. "రాజమౌళి సార్.. 45 సెకన్ల వీడియోను ఇంత వైవిధ్యంగా ఎలా చూపించగలిగారు?" అని నాని కామెంట్ చేశారు.
మరోవైపు బన్నీ స్పందిస్తూ.. "మైండ్ బ్లోయింగ్. భారతీయ చిత్రపరిశ్రమకు రాజమౌళి ఓ గర్వకారణం. నా బ్రదర్ చరణ్.. నా బావ తారక్.. పవర్‌ప్యాక్డ్ ప్రదర్శనతో అదరగొట్టేశారు. అజయ్, ఆలియా, శ్రియతోపాటు చిత్రబృందం మొత్తానికి నా హృదయ పూర్వక అభినందనలు" అని బన్నీ తెలిపారు. వాళ్లిద్దరి కామెంట్స్‌పై స్పందించిన 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ ధన్యవాదాలు తెలిపింది. 'పుష్ప' సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది.