తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పేరు మార్చుకున్న హీరోయిన్​ సమంత..!

కథానాయిక సమంత అక్కినేని ట్విట్టర్​లో తన పేరు మార్చుకుంది. ప్రస్తుతం నటిస్తోన్న 'ఓ బేబీ' సినిమా టైటిల్​లోని 'బేబీ' పేరును అక్కినేని ముందు చేర్చుకుంది.

పేరు మార్చుకున్న హీరోయిన్​ సమంత

By

Published : May 26, 2019, 9:08 PM IST

హీరోయిన్​ సమంత, హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకోగానే ట్విట్టర్​లో పేరు మార్చుకుంది. ఇప్పుడు మరోసారి పేరు మార్పు చేసి 'బేబీ అక్కినేని'గా అభిమానులకు కనిపించింది. ఆమె ప్రస్తుతం 'ఓ బేబీ' అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్​లుక్​నే తన ఫ్రొఫైల్​ ఫొటోగా పెట్టుకుంది.

సమంత ట్విట్టర్​

70 ఏళ్ల వృద్ధురాలి ఆత్మ 20 ఏళ్ల యువతి శరీరంలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుందనే వినూత్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కు రీమేక్​గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించింది.

ఓ బేబీ సినిమాలో సమంత లుక్

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జూలైలో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇటీవలే విడుదలైన టీజర్​ అభిమానుల్ని అలరిస్తోంది.

ఇది చదవండి: నాతో ఎంజాయ్​మెంట్ మాములుగా ఉండదంటున్న సమంత

ABOUT THE AUTHOR

...view details