తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు నిర్మాతల ఆనందం - tollywood latest news

ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు నిర్మాతల మండలి ఆనందం వ్యక్తం చేసింది. పలు రాయితీలు ప్రకటించడం టాలీవుడ్​కు ఎంతో చేయూతనిచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్​కు కృతజ్ఞతలు తెలిపారు.

telugu-film-producers-council-thanks-to-ap-cm-jagan-mohan-reddy
ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు నిర్మాతలు ఆనందం

By

Published : Dec 19, 2020, 5:43 PM IST

Updated : Dec 19, 2020, 5:49 PM IST

ఆంధ్రప్రదేశ్​లో సినిమా థియేటర్ల విద్యుత్ ఛార్జీల రద్దుతో పాటు థియేటర్లకు రిసార్ట్ ప్యాకేజి కింద రుణాలు ప్రకటించడంపై తెలుగు నిర్మాతల మండలి హర్షం వ్యక్తం చేసింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన టాలీవుడ్​కు ఏపీ ప్రభుత్వం రాయితీలు ప్రకటించడం ఎంతో చేయూతనిచ్చిందని నిర్మాతల వాణిజ్య మండలి అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ ఆనందం వ్యక్తం చేశారు.

ఏపీ సీఎం జగన్​కు కృతజ్ఞత చెబుతూ నిర్మాతల మండలి ప్రకటన

ఏప్రిల్, మే, జూన్ నాటి థియేటర్ల యాజమాన్యాలు చెల్లించాల్సిన ఫిక్స్​డ్ విద్యుత్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయడం, మిగిలిన 6 నెలల ఫిక్స్​డ్ విద్యుత్ ఛార్జీలను వాయిదాల పద్దతిలో చెల్లించేందుకు ఆమోదించడం, రిసార్ట్ ప్యాకేజి కింద ఏ,బీ సెంటర్లకు 10 లక్షలు, సి సెంటర్ థియేటర్లకు 5 లక్షల చొప్పున రుణాలు ఇచ్చేలా ఏపీ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకోవడం పరిశ్రమకు ఊరటనిస్తుందని నారాయణదాస్ అన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం థియేటర్స్​కు వెసులుబాటుతోపాటు వేలాది మంది సినీ కార్మికులకు జీవనోపాధి కలిగిస్తుందని పేర్కొన్నారు.

అటు ఇండస్ట్రీలోని అగ్ర నటీనటులు, నిర్మాణ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్లు కూడా చేస్తున్నారు.

Last Updated : Dec 19, 2020, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details