తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినిమాకు రూ.5 లక్షల కంటే ఎక్కువ తీసుకునే వారి పారితోషికంలో కోత - మా నటీనటుల సంఘం తాజా వార్తలు

సినిమాకు రూ.5 లక్షల కంటే ఎక్కువ తీసుకునే వారి పారితోషికంలో కోత
సినిమాకు రూ.5 లక్షల కంటే ఎక్కువ తీసుకునే వారి పారితోషికంలో కోత

By

Published : Oct 3, 2020, 6:30 PM IST

Updated : Oct 3, 2020, 7:42 PM IST

18:27 October 03

సినిమాకు రూ.5 లక్షల కంటే ఎక్కువ తీసుకునే వారి పారితోషికంలో కోత

ఏటీఎఫ్​పీజీ విడుదల చేసిన ప్రకటన

థియేటర్లు తెరుచుకునే ముందు తెలుగు సినీపరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాల తగ్గింపుపై తెలుగు సినీ నిర్మాతలు, 'మా' నటీనటుల సంఘం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. యాక్టివ్​​ తెలుగు సినీ నిర్మాతల గిల్డ్​, 'మా' నటీనటుల సంఘం సమావేశమైంది.  

'మా'తో ఒప్పందం కుదిరిందని యాక్టివ్ తెలుగు సినీనిర్మాతల గిల్డ్ వెల్లడించింది. ఈ ఒప్పందంలో లాక్‌డౌన్‌కు ముందున్న పారితోషికాల్లో 20 శాతం తగ్గింపునకు అంగీకారం కుదిరింది. సినిమాకు రూ.5 లక్షలకు మించి తీసుకునేవారి పారితోషికాల్లో 20 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపారు. రోజుకు రూ. రోజుకు రూ.20 వేలలోపు తీసుకునేవారి పారితోషికాలు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. కరోనా వేళ నటులు, సాంకేతిక నిపుణులు సహకరించాలని యాక్టివ్ తెలుగు సినీ నిర్మాతల గిల్డ్  కోరింది.  

ఇదీ చదవండి:"మా'లో గొడవలుంటే మీకు కచ్చితంగా చెప్తాం"

Last Updated : Oct 3, 2020, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details