ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తెలుగు సినీ సంగీత కళాకారుల సంఘం అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటించింది. హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్లో సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గాయనీ గాయకులు, సంగీత దర్శకులు హాజరై బాలుకు నివాళులర్పించారు. ఎస్పీబీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు. తమకు తండ్రి తర్వాత తండ్రిలాండివాడని పేర్కొన్నారు. ఆయన చూపిన బాటలో నడుస్తామని అన్నారు.
ఎస్పీ బాలుకు సినీ సంగీత కళాకారులు శ్రద్ధాంజలి
గాన గంధర్వుడు ఎస్బీ బాలుకు తెలుగు సినీ సంగీత కళాకారుల సంఘం నివాళులు అర్పించింది. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు.. పలువురు గాయనీ గాయకులు, సంగీత దర్శకులు హాజరయ్యారు. ఈక్రమంలోనే బాలుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
బాలుకు సనీ సంగీత కళాకారులు శ్రద్ధాంజలి
ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. బాలుకు ఇచ్చిన మాట ప్రకారం తాను సంగీత దర్శకుడిగా పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఆయన పాటల నిధి భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. దర్శకుడు రాఘవేంద్ర రావు, మాదవపెద్ది సురేష్, మనో, ఎంఎం శ్రీలేఖ, శ్రీరామచంద్ర, కౌసల్య, నూతన, సందీప్, శశికళ, ప్రవీణ్ తదితరులు జూమ్ ద్వారా బాలుకు తమ సంతాపాన్ని ప్రకటించారు.
Last Updated : Sep 29, 2020, 9:59 PM IST