క్రిస్మస్కు కొత్త పోస్టర్లు.. సంక్రాంతికి సినిమాలు - హిట్ సినిమా ఫస్ట్‌లుక్
క్రిస్మస్ను పురస్కరించుకొని పలు తెలుగు సినిమా పోస్టర్లును విడుదల చేశారు. అందులో కొన్ని చిత్రాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఈరోజు క్రిస్మస్.. కానీ సినీ ప్రేక్షకులు మాత్రం సంక్రాంతి గురించే మాట్లాడుతున్నారు. కారణం ఈ సారి పండక్కి వచ్చేవి ఆషామాషీ సినిమాలు కాదు కాబట్టి. విడుదలకు ముందే కొన్ని చిత్రాలపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే పతంగుల పండగ దగ్గరికి వచ్చే కొద్ది సరికొత్త లుక్‌లతో అంచనాలు పెంచేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే క్రిస్మస్ పోస్టర్లను విడుదల చేశారు. వీటిలో మహేశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు', రజనీకాంత్ 'దర్బార్', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'తో పాటు పలు సినిమాలు ఉన్నాయి.