తెరపై ప్రేమ కల్పితం! కానీ నిజజీవితంలో పలువురు హీరోహీరోయిన్లు, దానిని నిజం చేసి చూపించారు. మరికొందరు మాత్రం.. 'అంతా ఓకే, ఇక పెళ్లి మాత్రమే మిగిలుంది' అనే సమయానికి తమ బంధాన్ని తెగదెంపులుచేసేసుకున్నారు. కారణాలు ఏమైనప్పటికీ, వారి లవ్ మాత్రం బ్రేకప్ అయిపోయింది. ఆ ఇద్దరికే కాకుండా వారి వారి అభిమానులకు కూడా వేదన మిగిల్చింది. ఇంతకీ అలాంటి జంటలు ఏవి? వారు విడిపోవడానికి కారణాలు ఏంటి?
1. ఉదయ్‌కిరణ్-సుస్మిత
2000లో లవర్‌బాయ్ అంటే ఎక్కువగా గుర్తొచ్చే పేరు ఉదయ్‌కిరణ్. చేసినవి కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశారు. మెగాస్టార్ చిరంజీవి పెద్దకుమార్తె సుస్మిత, ఉదయ్ ప్రేమించుకున్నట్లు.. 2003లో వీరికి నిశ్చితార్థం కూడా జరిగినట్లు సినీవర్గాల్లో చర్చ సాగింది. కానీ ఏమైందో ఏమో వివాహం మాత్రం జరగలేదు. ఆ తర్వాత ఉదయ్, విషితను.. సుస్మిత, విష్ణు ప్రసాద్‌ను పెళ్లిచేసుకున్నారు.
2.రష్మిక-రక్షిత్ శెట్టి
కన్నడలో 'కిరిక్ పార్టీ'తో హీరోయిన్గా పరిచయమైన హీరోయిన్ రష్మిక.. అందులో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ఏడడుగుల బంధానికి సిద్ధమైంది. కానీ నిశ్చితార్థం జరిగిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు.
3.మెహ్రీన్-భవ్య భిష్ణోయ్
తెలుగులో హీరోయిన్గా వరుస సినిమాలు చేసిన మెహ్రీన్.. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు భవ్య భిష్ణోయ్ను వివాహమాడాలని నిశ్చయించుకుంది. అయితే కొన్నాళ్ల తర్వాత, తమ నిశ్చితార్థం రద్దు చేసుకుంటున్నట్లు మెహ్రీన్ సోషల్ మీడియాలో వెల్లడించింది. అలా వీరి బంధానికి తెరపడింది.