ఒత్తిడి సామాన్యులకే కాదు... ప్రముఖులకూ ముఖ్యంగా వెండితెరమీద తళుక్కున మెరిసే హీరోహీరోయిన్లకూ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులైతే టెన్షన్‌గా ఉందని బయటకు చెప్పేస్తారు. కానీ హీరో హీరోయిన్లు అలా చెప్పుకోలేరు కాబట్టి దాన్నుంచి బయటపడేందుకు తమకు నచ్చిన పనులు చేస్తారట. ఇంతకీ ఆ పనులేంటంటే?
వ్యాయామం చేస్తా
సినిమాల్లో ఫైట్‌సీన్లూ, ఇతర యాక్షన్ సన్నివేశాలూ చేస్తున్నప్పుడు సహజంగానే ఒత్తిడి ఎదురవుతుంది. ఆ ఒత్తిడి పోయి నేను మళ్లీ చురుగ్గా షూటింగ్‌లో పాల్గొనాలి కాబట్టి అప్పటికప్పుడు రిలాక్స్ అయ్యేందుకు ఎక్కడున్నా సరే, వ్యాయామాలు చేస్తా. షూటింగ్ అర్ధరాత్రి పూర్తయినా సరే కాస్త ఒత్తిడిగా అనిపిస్తే ఫిట్‌నెస్ ట్రైనర్ సాయంతో ఒకేసారి వంద స్క్వాట్స్, ఇతర వర్కౌట్లు చేసేస్తుంటా. ఒకవేళ నేను ఇంట్లో ఉంటే.. వ్యాయామాలు చేయడం సహా కాసేపు నేనెంతో ఇష్టంగా కట్టించుకున్న వాలీబాల్ కోర్టులో వాలీబాల్ ఆడతా. ఈ రెండూ కాకుండా స్నేహితులూ, కుటుంబ సభ్యులతోనూ గడిపేందుకు ప్రయత్నిస్తా. అంతేతప్ప ఒత్తిడిని పోగొట్టుకునేందుకు ప్రత్యేకంగా ఏదయినా విహారయాత్రకు మాత్రం వెళ్లాలనుకోను.
పిల్లలు ఉంటే చాలు
ఒక నటుడిగా నేను నటించే సినిమాల్లోని ప్రతి సన్నివేశానికీ వందశాతం న్యాయం చేయాలనుకోవడం సహజమే కాబట్టి... ఒత్తిడి ఎదురవడం మామూలే. అయితే... ఇంటికెళ్లాక నమ్రతతోనూ పిల్లలతోనూ కాసేపు గడిపితే చాలు ఆ ఒత్తిడి ఇట్టే మాయమవుతుంది. ముఖ్యంగా సీతూపాప చెప్పే కబుర్లు వినడం, గౌతమ్‌తో ఏదయినా వీడియోగేమ్ ఆడటం పూర్తయ్యేసరికి నేను రీఛార్జ్ అయిపోతా. ఇంకా విశ్రాంతిని కోరుకుంటే మాత్రం ఓ పుస్తకాన్ని చదవడం మొదలుపెడతా. కాస్త విరామం దొరికినప్పుడు కుటుంబమంతా కలిసి ఎక్కడికైనా వెళ్లడం కూడా మామూలే కాబట్టి.. వీటన్నింటితోనే ఎప్పటికప్పుడు నా పని ఒత్తిడినుంచి బయటపడిపోతుంటా.
పప్పీతో గడుపుతా