తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాక్సాఫీస్ బరిలో భారీ చిత్రాలు

అభిమానులను అలరించేందుకు  2019, 20 సంవత్సరాల్లో భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వాటిల్లో రాజమౌళి ఆర్​ఆర్​ఆర్​, చిరంజీవి సైరా, ప్రభాస్ సాహో, అమితాబ్ బ్రహ్మాస్త్ర సినిమాలున్నాయి.

By

Published : Mar 19, 2019, 6:34 AM IST

Updated : Mar 19, 2019, 8:31 PM IST

బాక్సాఫీస్ బరిలో భారీ చిత్రాలు

చలనచిత్రం... మూకీతో మొదలై మనసు మైమరిపించే స్థాయికి చేరింది. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ మన చిత్రాలూ ఇలా ఉంటే బాగుండు అనుకునేవాళ్లం. ప్రస్తుతం పరిస్థితి మారింది హాలీవుడ్​కు ఏ మాత్రం తగ్గకుండా భారీ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు మన దర్శకులు. మరి ఆ సినిమాలేంటో చూద్దామా..!

  • ఆర్ఆర్ఆర్..

బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్​చరణ్ కలిసి నటిస్తోన్న చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'​. 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్​తో రూపొందుతున్న ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతుంది. అల్లూరిగా చెర్రీ, కుమ్రం భీం​గా తారక్​ నటిస్తున్నారు. ఆలియా భట్, జైసీ ఎడ్గర్ జోన్స్ కథానాయికలు. వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ చిత్రం.

'ఆర్​ఆర్​ఆర్'​ స్టోరీ లైన్​
  • సైరా..

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సైరా. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. రూ. 250 కోట్ల బడ్జెట్​తో నిర్మిస్తున్నఈ చిత్రానికి నిర్మాత రామ్​చరణ్​. నయనతార కథానాయికగా, బిగ్​ బీ అమితాబ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • సాహో...

బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ 'సాహో'గా వస్తున్నాడు. రూ. 225 కోట్ల వ్యయంతో ఈ సినిమా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ హీరోయిన్​గా నటిస్తోంది. తెలుగు,తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేయనున్నారు.

  • బ్రహ్మాస్త్ర..

అమితాబ్​ బచ్చన్, నాగార్జున, రణ్​బీర్​ కపూర్, ఆలియా భట్ లాంటి భారీ తారాగణం నటిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ రూ. 150కోట్లు. అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో డిసెంబరు 20న విడుదల కానుంది.

  1. ఈ సినిమాలతో పాటు మోహన్ లాల్, సునీల్ శెట్టి, ప్రభుదేవా, అర్జున్ సారా, సిద్దిఖీ ప్రధాన పాత్రల్లో మలయాళ చిత్రం 'మరక్కర్​' రాబోతుంది. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రూ.100 కోట్లతో తెరకెక్కుతోంది.
  2. బాలీవుడ్ సినిమా 'కళంక్' సైతం పెద్ద నటీనటులతో తెరకెక్కుతోంది. సంజయ్ దత్, మాధురీ, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా ప్రధానపాత్రధారులుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

.

Last Updated : Mar 19, 2019, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details