సినిమాల్లో అతిథి పాత్రల్లో ఇతర హీరోలు, నటులు కనిపిస్తే ప్రేక్షకులు సరికొత్త అనుభూతికి లోనవుతుంటారు. ఎక్కువగా బాలీవుడ్ చిత్రాల్లో ఈ విధంగా జరుగుతుంటుంది. తెలుగులో అడపా దడపా ఒకరిద్దరు తళక్కున మెరిసినా.. ఎక్కువ మంది ఉండటం అరుదు. కానీ 1987లో వచ్చిన విక్టరీ వెంకటేశ్ 'త్రిమూర్తులు' చిత్రంలో 20 మంది సినీ ప్రముఖులు దర్శనమిచ్చారు. అతిథి పాత్రల్లో ఇంతమంది మెరవడం అప్పటికీ ఇప్పటికీ ఇదే రికార్డు.
విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన 'త్రిమూర్తులు' చిత్రంలోని ఓ పాటలో అప్పటి స్టార్ హీరోల్లో చాలా మంది స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చారు. శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, విజయశాంతి, విజయనిర్మల, రాధ, జయమాలిని, శారద, పరుచూరి బ్రదర్స్, మురళీ మోహన్, గొల్లపూడి మారుతిరావు, కోడి రామకృష్ణ, కోదండరామిరెడ్డి లాంటి అగ్రసినీ ప్రముఖులు అతిథి పాత్రల్లో మెరిశారు.