బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. సుశాంత్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి డ్రగ్స్ కోణం బయటపడటం వల్ల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌బీసీ) అధికారులు రియా చక్రవర్తితోపాటు ఆమె సోదరుడిని కూడా అరెస్టు చేశారు. విచారణ క్రమంలో రియా 25 మంది ప్రముఖుల పేర్లు చెప్పినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. రకుల్‌ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, ముఖేష్ చబ్రా పేర్లను కూడా ఆమె బయటపెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రకుల్, రియా కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
డ్రగ్ కేసు: నాకేం భయం లేదంటున్న నవదీప్ - navdeep movies updates
సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి డ్రగ్స్ కోణంలో ఇటీవలే అరెస్టయిన రియా చక్రవర్తి.. విచారణలో పలువురు నటుల పేర్లు బయటపెట్టినట్లు సమాచారం. వారిలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినవారు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే హీరో నవదీప్‌పై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి గట్టిగా సమాధానమిచ్చాడు నవదీప్.
ఈ నేపథ్యంలో ఓ నెటిజన్.. 'ఇది మళ్లీ టాలీవుడ్‌కు యూటర్న్ తీసుకుంది. నవదీప్ అన్న మనకి ఈ బాధలు తప్పేలా లేవు. కొంచెం జాగ్రత్త' అని వెటకారంగా నవ్వుతున్న ఎమోజీలు షేర్ చేశాడు. దీన్ని చూసిన నవదీప్ గట్టిగా సమాధానం ఇచ్చాడు. 'నాకు ఏం బాధ లేదు బ్రదర్.. నువ్వు కూడా బాధపడకు. పద పనికొచ్చే పనులు చేద్దాం' అని రిప్లై ఇచ్చాడు.
సుశాంత్‌కు తాను మత్తు పదార్థాలు సరఫరా చేసేదాన్నని ఇప్పటికే రియా విచారణలో ఒప్పుకుంది. తాజా సమాచారం ప్రకారం.. 14 రోజుల కస్టడీలో ఉన్న రియా 20 పేజీల వివరణాత్మక స్టేట్‌మెంట్‌ను ఎన్‌సీబీకి అందించిందని తెలుస్తోంది. బాలీవుడ్‌లో మాదకద్రవ్యాల సరఫరా, కొనుగోలు చేసే 25 మంది సెలబ్రిటీల పేర్లను అందులో వెల్లడించినట్లు సమాచారం.