ప్రముఖ కథానాయకుడు నాగార్జున.. బెంగళూరులోని పునీత్ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. పునీత్ లేడనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. తనకు శివన్నతో(పునీత్ అన్నయ్య) ఏం మాట్లాడాలో కూడా తెలియలేదని చెప్పారు.
పునీత్ కుటుంబసభ్యులను పరామర్శించిన నాగార్జున - పునీత్ రాజ్‌కుమార్ లేటెస్ట్ న్యూస్
ఇటీవల కన్నుమూసిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబసభ్యుల్ని హీరో నాగార్జున పరామర్శించారు. పునీత్ మరణం పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పునీత్ రాజ్‌కుమార్
ఇంటిలో జిమ్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడం వల్ల పునీత్.. అక్టోబరు 29న తుదిశ్వాస విడిచారు. ఆయన హఠాన్మరణంతో అభిమానులే కాకుండా పలువురు నటీనటులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. పునీత్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
ఇవీ చదవండి: