మాదక ద్రవ్యాల కేసులో (Drugs case bollywood) హిందీ టీవీ నటుడు పట్టుబడ్డాడు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో బుల్లితెర నటుడు గౌరవ్ దీక్షిత్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎన్సీబీ శుక్రవారం వెల్లడించింది.
Drugs case bollywood: డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్ట్ - డ్రగ్స్ కేసు ముంబయి
ఎన్సీబీ దర్యాప్తు చేస్తున్న డ్రగ్స్ కేసులో (Drugs case bollywood) మరో నటుడు అరెస్టు అయ్యాడు. ముంబయికి చెందిన బుల్లితెర నటుడు గౌరవ్ దీక్షిత్ నివాసంలో సోదాలు చేసిన అధికారులు.. డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం సహా అతడిని అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్ట్
డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్సీబీ.. నటుడు అజాజ్ ఖాన్‌ను అరెస్టు చేసింది. విచారణలో భాగంగా గౌరవ్ దీక్షిత్ పేరును అజాజ్ బయటపెట్టాడు. దీంతో అతడికి లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో గౌరవ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ముంబయిలోని అతడి ఇంట్లో నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి :'పుష్ప' అప్డేట్.. టీజర్, సాంగ్‌తో మెగా హీరోలు
Last Updated : Aug 28, 2021, 11:57 AM IST