కరోనాతో 6 నెలలుగా ఎంతో నష్టపోయామని థియేటర్ల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 15 నుంచి థియేటర్లు తెరిచినా ఒకేసారి ప్రేక్షకులు రారన్నారు. నిర్వాహకులకు కొన్నాళ్లపాటు ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు.
'ఈ నెల 15న థియేటర్లు తెరిచినా సమస్యలెన్నో' - థియేటర్ల యాజమానుల సమస్యలు
12:21 October 03
'ఈ నెల 15న థియేటర్లు తెరిచినా సమస్యలెన్నో'
థియేటర్లలో అనేక జాగ్రత్తలు తీసుకుంటామని సంఘం ప్రతినిధులు వెల్లడించారు. శానిటైజర్లు ఏర్పాటుచేస్తామని.. ప్రేక్షకులు ఎవరూ టికెట్లు తాకకుండా చర్యలు చేపడతామని తెలిపారు. సినిమా విరామ సమయంలో ప్రేక్షకులు ఒకేచోట గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు తెరిచినా నాలుగు షోలు నడవడం కష్టంగానే ఉంటుందని... థియేటర్‌లో సగం సీట్లు నిండినా సంతోషమేనన్నారు. కొన్నింటిలో సినిమాలు ఆడకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇవీచూడండి:'తెర'లేస్తోన్న వినోదం.. జనాలు ఇంతకు ముందులా వస్తారా?