PUSHPA MOVIE FIFTH SHOW : పుష్ప చిత్రానికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి ఈనెల 30 వరకు ఈ చిత్రం ఐదో ఆట ప్రదర్శనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మాతల విజ్ఞప్తి మేరకు అదనపు షోకు అంగీకారం తెలిపినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
PUSHPA MOVIE FIFTH SHOW: అప్పటి వరకు 'పుష్ప' రోజుకు ఐదు షోలు - పుష్ప మూవీ అప్డేట్స్
15:45 December 16
'పుష్ప' చిత్రానికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి
PUSHPA MOVIE release : అల్లుఅర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన సినిమా 'పుష్ప'. భారీ అంచనాలతో డిసెంబరు 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు నుంచి పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్గా 'పుష్ప'ను తెరకెక్కించారు. ఇందులో బన్నీ సరసన రష్మిక హీరోయిన్గా చేసింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనుంజయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శేషాచలం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో ఈ సినిమా తీశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లు చిత్రంపై అంచనాల్ని తెగ పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో సమంత ప్రత్యేక గీతంతో సందడి చేసింది.
ఇదీ చూడండి:'పుష్ప' కోసం మూడేళ్లు అడవుల్లోనే!