బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు కూకట్పల్లి సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఝండ్' సినిమాపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు విడుదల చేయకూడదని నిర్మాతలకు ఆదేశించింది.
అమితాబ్ సినిమా విడుదలపై తెలంగాణ కోర్టు స్టే
అమితాబ్ కొత్త సినిమా విడుదలపై తెలంగాణ కూకట్పల్లి కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలిచ్చేంతవరకు ప్రేక్షకుల ముందుకు తీసుకురాకుడదని నోటీసులు పంపింది.
అమితాబ్
ప్రముఖ ఫుట్‌బాలర్ అఖిలేశ్ పాల్ జీవితాధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 'సైరత్' ఫేమ్ నాగరాజ్ మంజులే దర్శకత్వం వహిస్తున్నారు. అఖిలేశ్ బయోపిక్ తీసే హక్కులు తన దగ్గర ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన దర్శకుడు నంది చిన్నికుమార్ కోర్టును ఆశ్రయించారు. అఖిలేశ్ తనను మోసం చేశారని అన్నారు. విచారించిన కూకట్పల్లి కోర్టు.. సినిమా విడుదలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని 'ఝండ్' దర్శకుడు, నిర్మాతలకు నోటీసులు పంపింది.